Wednesday, January 22, 2025

కవిత అరెస్టుపై ఈడీ అధికారులతో కెటిఆర్ వాగ్వాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఈడీ అధికారులతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని కెటిఆర్ అధికారులను ప్రశ్నించారు. అరెస్ట్ చేయబోమని కోర్టులో చెప్పి ఎలా అరెస్ట్ చేస్తారు? సుప్రీంకోర్టులో ఇచ్చిన మాటను ఎలా తప్పుతారు? అని ప్రశ్నించారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవు ఉంటుందనే ఉద్దేశంతోనే కావాలని శుక్రవారం వచ్చార్న కెటిఆర్.. సోదాల తర్వాత కూడా ఇంట్లోకి రావద్దన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News