హైదరాబాద్: కాంగ్రెస్ సర్కారు ఐదు నెలల్లో ఏమీ అభివృద్ధి చేయలేదంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించడంపై టిపిసిసి చీఫ్, సిఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘కెటిఆర్… చీర కట్టుకుని వెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కి తిరుగు.. మేం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న హామీలు కనిపిస్తాయి…” అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి అలా మాట్లాడారు.
అందుకు కౌంటర్ గా కాసేపటి క్రితం కెటిఆర్ కూడా ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రేవంత్ రెడ్డి… నువ్వుకట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు రూ. 2500 చూపిస్తావా…మరీ ఇన్ని పచ్చి అబద్ధాలా? తెలంగాణలో ఉన్న 1.67 కోట్ల మంది ఆడబిడ్డలు అడుగుతున్నారు’’ అంటూ మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి,
నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు ₹2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా?
తెలంగాణాలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 యేండ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు
వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెసుని… pic.twitter.com/lI25q6Adgw
— KTR (@KTRBRS) May 5, 2024