Sunday, December 22, 2024

నేటి నుండి కెటిఆర్ సుడిగాలి పర్యటనలు

- Advertisement -
- Advertisement -

నేటి నుంచి ఆరు రోజుల పాటు సభలు,సమావేశాలు

రోడ్ షోలతో కెటిఆర్ బిజీ బిజీ
కెటిఆర్ క్యాంపెయినింగ్ టూర్ షెడ్యూల్ ఖరారు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ను మూడోసారి గెలిపించడమే లక్ష్యంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందు నుంచే అనేక నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్ సభలు నిర్వహించి, అందులో పాల్గొన్న మంత్రి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత క్షణం తీరిక లేకుండా సభలు, సమావేశాశాల్లో పాల్గొంటూనే రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. కెసిఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయడమే తన లక్ష్యంగా కెటిఆర్ ముందుకు సాగుతున్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఆరు రోజుల పాటు కెటిఆర్ బిజిబిజీగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయనున్నారు. కెటిఆర్ ఆరు రోజుల్లో 25 నియోజకవర్గాల్లో సభలు, రోడ్డుషోలలో పాల్గొననున్నారు. అందుకు సంబంధించిన టూర్ షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించారు. ప్రతి రోజూ ఐదు కార్యక్రమాలలో కెటిఆర్ పాల్గొంటారు. బుధవారం రాజన్న సిరిసిల్లలోని వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పాల్గొననున్నారు. వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించే (కథలాపూర్, మేడిపల్లి) మండలాల ప్రజాఆశీర్వాద సభలో, రుద్రంగి మండల కేంద్రంలో రోడ్ షోలో, చందుర్తి మండల కేంద్రంలో నిర్వహించే ప్రజాశీర్వాద సభలో పాల్గొంటారు. అనంతరం కోనరావుపేట మండలకేంద్రంలో రోడ్ షో, వేములవాడ పట్టణంలో నిర్వహించే వేములవాడ అర్బన్, రూరల్ మండలాల రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్లపల్లి మండల కేంద్రంలో రోడ్ షోలో పాల్గొననున్నారు.

ఈ నెల 16న చేవెళ్ల, వికారాబాద్, మారెపల్లిలో జరిగే రోడ్డు షోలో పాల్గొంటారు. సాయంత్రం కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ రోడ్డులో పాల్గొననున్నారు. 17న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శ్రీరాంనగర్, యూసుఫ్‌గూడ రోడ్డు షో, ఖైరతాబాద్ నియోజకవర్గంలో జహీర్‌నగర్, హిమాయత్‌నగర్ రోడ్డు షోలు, 18న రామగుండం, కొత్తగూడెం, నాంపల్లి, గోషామహల్‌లోని బేగంబజార్ ఛత్రీ, పుత్లిభౌలి, సికింద్రబాద్ నియోజకవర్గంలోని శాంతినగర్, ఎస్‌విఎస్ రోడ్డు షో, 19న భద్రాచలం, ఇల్లందు, ఖమ్మం, అంబారిపేట, ముషీరాబాద్‌లో రోడ్డు షో, 20న ఆలేరు, మిర్యాలగూడ, ఉప్పల్, ఎల్‌నగర్ రోడ్ షోలో కెటిఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలోనే నేతలు నిమగ్నమయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News