Monday, January 20, 2025

ఆసక్తిగా నాగార్జున-ధనుష్ ‘కుబేర’ ఫస్ట్ గ్లింప్స్..

- Advertisement -
- Advertisement -

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల భారీ ప్రాజెక్ట్ ’కుబేర’లో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. శుక్రవారం సూపర్ స్టార్ మహేష్ బాబు కుబేర మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఫస్ట్ గ్లింప్స్‌ని ప్రతి ప్రధాన పాత్రపై ఆసక్తిని పెంచేలా చూపించారు. ధనుష్ మురికివాడలో సాధారణ గడుపుతున్న వ్యక్తిగా పరిచయం అయ్యారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అతని ముఖంలో ఆనందం కనిపిస్తోంది. మరోవైపు నాగార్జున తన కుటుంబంతో ముంబైలో నివసిస్తున్న సక్సెస్‌ఫుల్ మ్యాన్‌గా కనిపించాడు.

రష్మిక మందన్న పాత్ర ఆమె మధ్యతరగతి జీవితంలో అసంతృప్తితో పోరాడుతున్నట్లు కనిపిస్తుంది. శేఖర్ కమ్ముల కథను ఎక్కువగా తెలియజేయకుండా పాత్రల పరిచయాలపై దృష్టిపెట్టాడు. విజువల్‌గా కుబేర కట్టిపడేసింది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌విసిఎల్‌ఎల్‌పిపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. కుబేర… తమిళం, తెలుగు, హిందీలలో రూపొందుతున్న మల్టీలింగ్వల్ ప్రాజెక్ట్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News