Sunday, December 22, 2024

ఆగిన నృత్యం

- Advertisement -
- Advertisement -

ప్రముఖ భరత నాట్యం, కూచిపూడి కళాకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూత
ప్రపంచవ్యాప్తంగా కీర్తిగడించిన నృత్యకారిణి
టిటిడి ఆస్థాన నర్తకిగా సేవలు.. ప్రముఖుల సంతాపం

న్యూఢిల్లీ: ప్రముఖ భరత నాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి శనివారం మృతి చెందారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె శనివారం సాయంత్రం ఢిల్లీలో కన్నుమూశారు. భరత నాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలైన ఆమె 1968లో పద్మశ్రీ, 1977లో సంగీత నాటక అకాడమీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ అవార్డులు అందుకుని జాతీయ స్థాయిలోనే కాక, ప్రపంచ దేశాల్లోనూ కీర్తి గడించారు.

ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940 డిసెంబర్ 20న నిండుపున్నమినాడు జన్మించారు. తమిళనాడులోని చిదంబరంలో పెరిగారు. చిదంబరం నటరాజ దేవాలయానికి దగ్గరలోనే వీరి ఇల్లు ఉండేది. ఆ దేవాలయ కుడ్యాలపై ఉన్న శిల్పాల భంగిమలు ఆమెపై చెరగని ముద్రవేశాయి. రోజూ ఆ శిల్పాలను చూసి వచ్చి ఇంటివద్దనే భంగిమలు ప్రదర్శించేవారు. యామిని అసలు పేరు పూర్ణతిలక. తండ్రి యామిని కృష్ణమూర్తి. తండ్రి ప్రోత్సాహం తోనే ఏడవ ఏటనే నాట్యంలో శిక్షణ ప్రారంభించారు.

పదేళ్లు వచ్చేసరికి నా ట్యంలో ఆమె నైపుణ్యం సాధించారు. తండ్రి ఆమెను మొదట చెన్నైలోని రుక్మిణీ అరండేళ్ కళాక్షేత్రంలో నాట్యశిక్షణ ఇప్పించారు. ప్రాథమిక నైపుణ్యాల ను నేర్చుకున్న తరువాత ప్రసిద్ధ ఎల్లప్ప పిళ్లై, తంజావూరు కిట్టప్ప పిళ్లై వద్ద నృత్యంలో మరింత శిక్షణ పొందడానికి కాంచీపురం వెళ్లారు. కూచిపూడి నాట్యం కూడా నేర్చుకున్నారు. తరువాత ప్రముఖ ఒడిస్సీ నాట్యాచార్యులు కే లూచరణ్ మహాపాత్ర దగ్గర ఒడిస్సీ నృత్యంలో శిక్షణ పొందారు. 1990లో ఢిల్లీలో యామిని స్కూల్ ఆఫ్ డాన్స్ అనే పేరుతో స్వయంగా డాన్స్ స్టూడియా నెలకొల్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా కొన్నాళ్లు వ్యవ హరించారు. కూచిపూడికి ప్రతీకగా ప్రతిష్ఠను సాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News