Thursday, November 21, 2024

రుణ యాప్‌ల కేసులో కుడోస్ సంస్థ సిఇవొ అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Kudos CEO arrested in Loan apps case
14 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్:  చైనా రుణయాప్‌ల కేసుకు కుడోస్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సివొ పవిత్ర ప్రదీప్ కాల్వేకర్‌ను ఇడి అధికారులు శనివారం నాడు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అధికారులు చంచల్‌గూడా జైలుకు తరలించారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ కుడోస్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇవొ పవిత్ర ప్రదీప్ 39 రుణ యాప్ కంపెనీకి సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరించినట్లు ఇడి విచారణలో తేలింది. కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి రుణాలు తీసుకునేలా ప్రొత్సహించడంతో పాటు తిరిగి రాబట్టుకునేందుకు దారుణంగా వేధింపులకు పాల్పడినట్లు ఇడి పేర్కొంది.

కుడోస్ కాల్ సెంటర్ల వేధింపులు తాళలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఇడి దర్యాప్తులో తేలింది. ఆర్‌బిఐ నిబంధనలు ఉల్లంఘించి 39 ఫిన్ టెక్ కంపెనీలు రూ. 2,200 కోట్లకు పైగా రుణ లావాదేవీలు జరిపిందని, ఏడాదికి పైగా సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తున్న కుడోస్ సంస్థ రూ.24 కోట్ల అక్రమ లబ్ధి పొందిందని ఇడి ఈక్రమంలో కుడోస్ సహకారంలో 39 కంపెనీలు రూ.568 కోట్ల లబ్ధి పొందటంతో పాటు లావాదేవీలు జరిపినట్లు ఇడి అధికారులు పేర్కొన్నారు. కుడోస్ సిఇవొ పవిత్ర వాల్వేకర్ విచారణలో సహకరించలేదని, ఫిన్‌టెక్ కంపెనీల నిర్వహకుల వివరాలు, లబ్దిదారుల వివరాలు చెప్పకపోవడమే కాకుండా రాజకీయ అగ్రనేతల పేర్లు చెప్పి కేసును ప్రభావితం చేసినట్లు ఇడి పేర్కొంది.

విదేశాలకు రూ. 1400 కోట్లు 

రాష్ట్రంలో చైనా రుణయాప్‌ల కేసులో నకిలీ బిల్లులతో రూ.1,400 కోట్ల నిధులు హాంకాంగ్,మారిషస్ దేశాలకు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఇడి అధికారులు విదేశాలకు నిధుల మళ్లింపుపై సిసిఎస్‌లో ఫిర్యాదు చేశారు. కాగా చైనా రుణయాప్‌ల కేసులో మరో కేసు నమోదుచైనా రుణ యాప్‌ల కేసులో మరో కొత్తకోణం వెలుగు చూసింది. రుణయాప్‌ల కేసులో శనివారం నాడు మరో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా బ్యాంక్ అధికారులను ఇడి అధికారులు విచారించగా నిధులు విదేశాలకు మళ్లించిన విషయం బయటికొచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News