Monday, January 20, 2025

తెలంగాణ అమరవీరులకు జోహార్లు

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి రూరల్ : 60 ఏళ్ల సీమాంధ్ర పాలనలో వెనుకబడ్డ, అణిచివేయబడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు ఎందరో ఉద్యమకారులు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారు. సామాజిక, ఆర్థిక రాజకీయ రంగాల్లో వెనుకబాటుకు గురి చేసిన దోపిడి పాలనను అంతమొందించేందుకు 1250 మంది మృతవీరులు తెలంగాణ ఉద్యమకారులు అమరులయ్యారు. తెలంగాణ ప్రజల అస్తిత్వం ఆత్మగౌరవం కంటే తమ ప్రాణాలు విలువైనవి కావని ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల అమరత్వాన్ని గుర్తు చేసుకునే తరుణమిదని, ఒక్కొక్కరుగా ఒరిగిన అమరవీరులు ఉద్యమానికి ఊపిరూదారని, అమరవీరుల ఆశయాలను సాధించుకుందామని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు.

గురువారం కల్వకుర్తి పట్టణంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరవీరుల స్థూపం తెలంగాణ మృత వీరులకు ఎమ్మెల్యే ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ అమరుల త్యాగ ఫలితమే నేటి మన సంబరాలు అని ఆయన అన్నారు. ఉద్యమ నాయకులు ముఖ్యమంత్రి కెసిఆర్ చావు అంచుకు వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మృత వీరుల కుటుంబాలకు సిఎం కెసిఆర్ అండగా నిలిచారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి, అమరవీరుల త్యాగ ఫలితమే అని ఎమ్మెల్యే అన్నారు.

అమరవీరులకు నివాళులర్పించారు. దుందుభి కళాకారులు సింగం విజయ్ గౌడ్ తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి స్మరిస్తూ పాట పాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఎడ్మ సత్యం, కల్వకుర్తి ఆర్‌డిఓ రాజేష్ కుమార్, డిఎస్పి గిరిబాబు, సిఐ పార్ధసారథి గౌడ్, ఎస్సై రమేష్, తహసిల్దార్ రాంరెడ్డి, ఎంపిడిఓ ఆంజనేయులు, కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మెన్ సింగం విజయ్ గౌడ్, పిఎసిఎస్ చైర్మెన్ జనార్దన్ రెడ్డి, ఎంపిపి సామ మనోహర చెన్నకేశవులు, కౌన్సిలర్లు సూర్య ప్రకాష్ రావు, మనిహర్ రెడ్డి, సైదులు గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జమ్ముల శ్రీకాంత్, బేకులపల్లి లక్ష్మయ్య, ఎస్సి సెల్ మండల ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News