Tuesday, November 5, 2024

కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమతపై బదిలీ వేటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /సిటీ బ్యూరో: జిహెచ్‌ఎంసిలో ప్రక్షాళన మొదలైంది. ఇద్దరు జోనల్ కమిషనర్లతోపాటు మరో ఆరుగురు డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేశారు. వీరి స్థానంలో ఇద్దరి ఐఎఎస్ అధికారులను జోనల్ కమిషనర్లుగా ప్రభుత్వం నియమించింది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో పూర్తిగా చక్రం తిప్పిడం ద్వారా తనకు ఎదురే లేదన్నట్లు వ్యవహరించి ఓ అధికారిని జిహెచ్‌ఎంసి నుంచి పూర్తిగా తప్పించగా, మరో జోనల్ కమిషనర్ డిప్యూటేషన్ రద్దు చేసి మాతృ సంస్థకు పంపించారు. దీంతో జిహెచ్‌ఎంసిలో ఇంతకాలంతో తాము ఆడిందే ఆట, పాటిందే పాట అన్నట్లుగా వ్యహరించిన పలువురు అధికారుల్లో ఒక్కసారిగా వణుకు మొదలైంది.

సుదీర్ఘకాలంగా కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా పని చేస్తున్న టిజిఒ రాష్ట అధ్యక్షురాలు వి. మమతపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం ఆమెను మున్సిపల్ శాఖ నుంచి పూర్తిగా తప్పించి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా నియమించారు. ఆమె స్థానంలో ఇటీవలే జిహెచ్‌ఎంసి అదనపు కమిషననర్‌గా బదిలీపై వచ్చిన ఐఎఎస్ అధికారి అభిలాష అభినవ్‌ను కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా నియమించారు. అదేవిధంగా శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్న శ్రీని వాస్‌రెడ్డిని హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ అడిషినల్ డైరెక్టర్‌గా నియమించారు. ఆయన స్థానంలో ఐఎఎస్ అధికారి స్నేహ శబరిష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అంతేకాకుండా జిహెచ్‌ఎంసిలో ఎస్‌ఆర్‌డిపి ఎస్‌ఈగా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణను మూసీ రివర్ ఫ్రంట్ సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా నియమించారు. దీంతో గ్రేటర్‌లోని ఆరు జోన్లలో ప్రధానమైన ఖైరతాబాద్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్లకు జోనల్ కమిషనర్లుగా ఐఎఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. మిగిలిన మూడు జోన్లకు నాన్ ఐఎఎస్ అధికారులు జోనల్ కమిషనర్లుగా బాధ్యతల్లో ఉన్నారు.
6 మంది డిప్యూటీ కమిషనర్లు బదిలీ
జిహెచ్‌ఎంసిలో 5 మంది డిప్యూటీ కమిషనర్లతోపాటు డిప్యూటీ కలెక్టర్‌కు స్థానచలనం కల్పించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల విభాగంలో స్పెషల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్ వై. శ్రీనివాస్‌రెడ్డిని ఫలక్‌నుమా సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేశారు. అక్కడ విధు లను నిర్వర్తిస్తున్న డి .లావణ్యను తిరిగి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. అదేవిధంగా సంతోష్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న వి. నర్సింహ్మను అక్కడి నుంచి కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేశారు. కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్‌గా పని చేనిచేస్తున్న నాగమణిని సంతోష్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. జిహెచ్‌ఎంసి ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తున్న ఎల్. సరితను చార్మినార్ డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. ఇప్పటి వరకు అక్కడ విధులను నిర్వహించిన ఢాకునాయక్‌ను అక్కడి నుంచి బదిలీ చేసి జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు. పరిపాలన సౌలభ్యంలో భాగంగానే ఈ బదిలీలను చేపట్టినట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.
షాక్‌లో డిప్యూటేషన్ అధికారులు
జిహెచ్‌ఎంసికి డిప్యూటేషన్‌పై వచ్చిన పలువురు అధికారు లు ఒక్కసారిగా షాక్‌కు గురువుతున్నారు. జిహెచ్‌ఎంసిలో ప్రభుత్వం చేపట్టిన బదిలీలో భాగంగా ఏకంగా జోనల్ క మిషనర్‌ను బదిలీ చేసి మాతృ సంస్థకు తిరిగి అప్పగించగా, మరో జోనల్ కమిషనర్‌ను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బ న్ మేనేజ్మెంట్ డైరెక్టర్‌గా నియమించడంతో జిహెచ్‌ఎంసి ప్రకంపనలు మొదలైయ్యాయి. జిహెచ్‌ఎంసిలో డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులతో పాటు రిటైర్‌మెంట్ తర్వాత ఎ క్స్‌టేషన్ పేరుతో కొనసాగతున్న పలువురు అధికారులే పె త్తనం చెల్లాయిస్తున్నారని ఎప్పటి నుంచో జిహెచ్‌ఎంసి అధికారులు ఉద్యోగులతో పాటు చివరికి ఉద్యోగ సంఘాలు సై తం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో పలువురి అధికారుల చర్యల వల్లే అవినీతి మరకలు అండడమే కాకుండా జి హెచ్‌ఎంసి అప్పుల ఊబిలోకి వెళ్లిందనే ఆరోపణలు ఉన్నా యి. ఇదే క్రమంలో ప్రభుత్వం మారడం, కాంగ్రెస్ అధికా రం చేపట్టడంతో ఇప్పుడు అలాంటి అధికారులు తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన మొదలైందని జిహెచ్‌ఎంసిలో జో రుగా చర్చ నడుస్తోంది. డిప్యూటేషన్‌పై వచ్చి సుదీర్ఘ కా లం గా జిహెచ్‌ఎంసిలో తిష్టవేసిన అధికారులను మాతృ సం స్థలకు తిప్పి పంపడంతో పాటు రిటైర్‌మెంట్ తర్వాత కూ డా ఇంకా జిహెచ్‌ఎంసిలో పని చేస్తున్న వారిని సైతం తొలగించాలని జిహెచ్‌ఎంసి ఉద్యోగ సంఘాలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News