Monday, December 23, 2024

ఖాతా తెరిచిన కుకీ పీపుల్ అలయన్స్

- Advertisement -
- Advertisement -

Kuki Peoples Alliance
గౌహతి: స్వదేశీ కుకీ పీపుల్స్ అలయన్స్(కెపిఎ) మణిపూర్‌లో తన ఖాతాను తెరిచింది. వారి అభ్యర్థి కిమ్నియో హాకిప్ హాంగ్‌షింగ్, సైకుల్ నియోజకవర్గంలో 1200 ఓట్ల తేడాతో గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి కెన్ రైఖాన్ రెండో స్థానంలో నిలిచారు.
చురచంద్‌పూర్ జిల్లాలోని సింఘత్‌లో అది పోటీ చేస్తున్న ఇతర సీటులో, కెపిఎ అభ్యర్థి చిన్లుంతంగ్ 1731 ఆధిక్యంలో ఉన్నారు. సమీప పోటీదారు బిజెపికి చెందిన గిన్‌సువాన్‌హౌ జోపై విజయం సాధించే అవకాశం ఉంది. ఇద్దరు రిటైర్డ్ బ్యూరోక్రాటులు, ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్, న్యాయవాది ఈ పార్టీని స్థాపించారు. కేవలం రెండు నెలల క్రితమే రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన కెపిఎ మణిపూర్‌లోని కుకీ తెగ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News