Monday, December 23, 2024

మణిపూర్ బీరెన్ సర్కారుకు షాక్

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : సంక్షోభిత మణిపూర్‌లో బీరెన్ సింగ్ సంకీర్ణ ప్రభుత్వం డీలాపడింది. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు స్వల్పబలంతో ఉన్న మిత్రపక్షం కుకీ పీపుల్స్ అలయెన్స్ (కెపిఎ) ప్రకటించింది. ఈ మేరకు ఈ కూటమి తీసుకున్న నిర్ణయాన్ని ఆదివారం గవర్నర్ అనుసూయకు తెలియచేసినట్లు వెల్లడైంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలించిన తరువాత ఇప్పటి ప్రభుత్వానికి మద్దతు కొనసాగింపు భావ్యం కాదని భావిస్తున్నట్లు ఈ పార్టీ తెలపింది. కెపిఎకు అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉంది. ఇకపై తమ మద్దతు ఈ ప్రభుత్వానికి ఉండబోదని ఈ లేఖద్వారా తెలియచేసుకుంటున్నామని కెపిఎ ప్రతినిధి టాంగ్‌మంగ్ హవోకిప్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News