చిరకాల ఘర్షణల మణిపూర్‌లో ఇప్పుడు కుకీ తెగలవారు రోడ్డెక్కారు. తెగల ఘర్షణల రాష్ట్రం నుంచి తమను విడగొట్టి తమకు ప్రత్యేక అధికారిక నిర్వహణ ఏర్పాటు చేయాలని కుకీలు ఉద్మమం చేపట్టారు. శనివారం కుకీ తెగలు మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో నిరసనలు, ర్యాలీలకు దిగారు. తాము ఇక్కడి గందరగోళ పరిస్దితుల నడుమ ఇమడలేమని , తమకు వేరే పాలన కావాలని పట్టుపట్టారు. కుకీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో హింసాత్మక ప్రత్యేకించి కంగపోక్పి ప్రాంతాలలో ఉద్రిక్తత నెలకొంది.
ఇక నాగా ప్రాబల్యపు ప్రాంతాల్లో ఘర్షణలు జరగకుండా కార్యకర్తలు మానవహారం చేపట్టారు. తమ ప్రాంతానికి ప్రత్యేక పాలనా అధికారపు ఏర్పాట్లు చేయాలని లేదా కేంద్ర పాలిత ప్రాంతం ప్రకటన వెలువరించాలని ఇప్పుడు కుకీలు ఉద్యమించడంతో చాలా నెలలుగా చల్లారని ఘర్షణలతో ఉన్న మణిపూర్‌లో మరింత సంక్షోభ పరిస్థితి ఏర్పడేలా ఉందని ఆందోళన వ్యక్తం అయింది. శనివారం ప్రదర్శనల నేపథ్యంలో మణిపూర్ బిజెపి ప్రతినిధి , గిరిజన నేత టి మైకెల్ నివాసంపై దాడి జరిగింది.