Wednesday, January 22, 2025

కుల్‌దీప్ @50 వికెట్లు

- Advertisement -
- Advertisement -

ధర్మశాల : భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్‌లో అతడు ఈ ఫీట్‌ను సాధించాడు. టీమిండియా బౌలర్లలో టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన ఆటగాడిగా ఈ చైనామన్ స్పిన్నర్ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్ స్టోను ఔట్ చేయడం ద్వారా కుల్దీప్ ఈ ఘనతను అందుకున్నాడు. ఇందుకు కుల్దీప్ యాదవ్‌కు కేవలం కేవలం 1871 బంతులు మాత్రమే అవసరమయ్యాయి. ఇక కుల్‌దీప్ తరువాతి స్థానంలో అక్షర్ పటేల్(2205 బంతులు) కొనసాగుతుండగా జస్ప్రీత్ బుమ్రా(2520 బంతులు), రవిచంద్రన్ అశ్విన్ – (2597 బంతులు)లు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News