Monday, December 23, 2024

చిరకాలం గుర్తుండిపోతుంది: కుల్దీప్ యాదవ్

- Advertisement -
- Advertisement -

కొలబో: దాయాది పాకిస్థాన్‌తో జరిగిన సూపర్4 మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేయడంపై భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశాడు. తన కెరీర్‌లోనే ఈ స్పెల్ చాలా ప్రత్యేకమైందని పేర్కొన్నాడు. ఆటకు వీడ్కోలు పలికినా ఈ స్పెల్ తీపి జ్ఞాపకంగా గుర్తుండి పోతుందన్నాడు. ప్రపంచ స్థాయి బ్యాటర్లు ఉన్న పాకిస్థాన్‌పై తాను ఇలాంటి ప్రదర్శన చేస్తానని ఎప్పుడూ ఊహించలేదన్నాడు.

25 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లను పడగొట్టడం ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నాడు. చిరకాల ప్రత్యర్థితో జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ప్రదర్శన చేయడం ఎంతో గర్వంగా ఉందన్నాడు. అత్యుత్తమ జట్టుపై ఐదు వికెట్ల ప్రదర్శన తన కెరీర్‌లోనే అత్యంత అరుదైన అంశంగా మిగిలిపోతుందన్నాడు. రానున్న ప్రపంచకప్‌లో మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఇది దోహదం చేస్తుందనే నమ్మకాన్ని కుల్దీప్ వ్యక్తం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News