Thursday, January 23, 2025

ఆ బౌలర్‌తోనే ఇంగ్లాండ్ ఓడిపోయింది: బాయ్‌కాట్

- Advertisement -
- Advertisement -

లండన్: టీమిండియా స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ బౌలింగ్‌ను ఇంగ్లాండ్ బ్యాటర్లు అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని ఆ దేశ మాజీ ఆటగాడు జెఫ్రీ బాయ్ కాట్ తెలిపారు. కుల్ దీప్‌తోనే ఇంగ్లాండ్ జట్టు ఈ సిరీస్‌లో ఓడిపోయిందన్నారు. హైదరాబాద్ టెస్టులో విజయం సాధించి వరసగా నాలుగు మ్యాచ్‌లు ఇంగ్లాండ్ ఓడిపోయిందన్నారు. కుల్‌దీప్ యాదవ్ నాలుగు మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాడని అభిప్రాయపడ్డాడు. కుల్‌దీప్ ఎడమ చేతి స్పిన్ బౌలింగ్‌ను మా బ్యాటర్లు అర్థం చేసుకోలేకపోవడంతో పాటు అసౌకర్యంగా కనిపించారని, మొదట్లో ఒక బౌలర్ మిస్టరీగా కనిపిస్తాడని, అంతర్జాతీయ బ్యాటర్ క్రమంగా అర్థం చేసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ దూకుడుగా ఆడడాన్ని ఆయన తప్పుబట్టాడు. నాణ్యమైన స్పిన్నర్లు ఎదుర్కునేటప్పుడు దూకుడుగా ఆడడం చాలా ప్రమాదకరమని సూచించారు. భారత్‌లో ఆడేటప్పుడు బ్యాటర్లు మంచి డిఫెన్స్ ఆడాల్సిన అవసరమని ఉందని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News