Monday, May 5, 2025

ఆ బౌలర్ కు బదులు కుల్దీప్‌నే ఆడించాలి: రైనా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో కుల్దీప్ యాదవ్ సేవలను ఉపయోగించుకోవాలని భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సూచించాడు. వరుణ్ చక్రవర్తితో పోల్చితే వన్డే ఫార్మాట్‌లో కుల్దీపే మెరుగైన బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. కుల్దీప్‌ను తుది జట్టులో చోటు కల్పించాల్సిందేనని పేర్కొన్నాడు. టి20 ఫార్మాట్‌లో వరుణ్ చక్రవర్తి తిరిగు లేని బౌలర్ అన్నాడు. అయితే వన్డేలకు అతని బౌలింగ్ సరిపోదన్నాడు. అతనితో పోల్చితే కుల్దీప్ వన్డేల్లో చాలా బెటర్ అని అభిప్రాయపడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో కుల్దీప్ మెరుగైన బౌలింగ్‌తో అలరించిన విషయాన్ని రైనా గుర్తు చేశాడు. త్వరలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ కంటే కుల్దీప్‌ను ఆడిస్తేనే టీమిండియాకు ప్రయోజనంగా ఉంటుందని రైనా పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News