Friday, December 20, 2024

వొడాఫోన్ ఐడియా బోర్డులోకి మళ్లీ కుమార్ మంగళం బిర్లా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతీయ బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా టెలికాం కంపెనీ వోడాఫోన్-ఐడియా (విఐ) బోర్డులో మళ్లీ చేరారు. కంపెనీలో అదనపు డైరెక్టర్‌గా ఆయన నియమితులయ్యారు. బిర్లా రెండేళ్ల క్రితం వొడాఫోన్-ఐడియా కంపెనీకి చైర్మన్‌గా ఉన్నారు. అయితే తర్వాత సంస్థ నష్టాల్లోకి వెళ్లడం, ఇతర కారణాల వల్ల ఆయన సంస్థను విడిచిపెట్టారు. కుమార్ మంగళం బిర్లా సంస్థలో చేరడంతో మార్కెట్లోకి విఐ షేర్లు భారీగా పెరిగాయి. శుక్రవారం వోడాఫోన్-ఐడియా షేర్లు 6.61 శాతం లాభంతో రూ.6.40 వద్ద ముగిశాయి. గురువారం షేరు విలువ రూ.6.05 వద్ద ఉంది.

కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.30.57 వేల కోట్లుగా ఉంది. బిర్లా ఏప్రిల్ 20 నుండి కంపెనీ బోర్డులో చేరినట్లు వోడాఫోన్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఫిబ్రవరి 7 నాటికి వోడాఫోన్-ఐడియాలో 8.36 శాతం వాటాను కలిగి ఉంది. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం కంపెనీ బకాయిని ఈక్విటీలోకి రూ. 16.43 వేల కోట్లుగా మార్చింది. దీని తరువాత భారత ప్రభుత్వం కంపెనీ అతిపెద్ద వాటాదారుగా మారింది. 2021లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఐడియాను రక్షించేందుకు గాను ప్రభుత్వం ఈ ప్యాకేజీని ఆమోదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News