Tuesday, November 5, 2024

కర్నాటకలో విపక్ష భేటీ హంగామానే: కుమార స్వామి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటకలో జనతదళ్ (ఎస్) బిజెపితో పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిపై మాట్లాడటం సముచితం కాదు సమయోచితం కాదని పార్టీ నేత హెచ్‌డి కుమారస్వామి తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు మరో 9 నెలల వ్యవధి ఉందని, అప్పటివరకు ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే అన్నారు. బెంగళూరులో విపక్షాల భేటీ గురించి కుమారస్వామి ఘాటుగా స్పందించారు. ఇది ప్రతిపక్ష సమావేశం కాదని, కాంగ్రెస్ ఘనత చాటుకునేందుకు సిద్ధం చేసుకున్న వేదిక అని విమర్శించారు. ఏదో గొప్ప పని చేశామని తెలియచేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కర్నాటకలో రైతుల ఆత్మహత్యల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News