Monday, December 23, 2024

కుమారస్వామి ఓ బ్లాక్‌మెయిలింగ్ కింగ్: డికె శివకుమార్

- Advertisement -
- Advertisement -

చిక్కమగళూరు(కర్నాటక): హసన్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అశ్లీల వీడియోల పంపిణీ వెనుక జెడిఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి ఉన్నారని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ బుధవారం ఆరోపించారు. అంతేగాక కుమారస్వామిని బ్లాక్‌మెయిలింగ్ కింగ్ అభివర్ణిస్తూ ఈ కథకుం హీరో, దర్శకుడు, నిర్మాత కూమా ఆయనేనని శివకుమార్ ఆరోపించారు. ఈ అశ్లీల వీడియోల పంపిణీలో డికె శివకుమార్ ప్రధాన కుట్రదారుడని, ఆయనను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలంని కుమారస్వామి డిమాండు చేయడంపై శివకుమార్ స్పందించారు.

కుమారస్వామి అన్న కుమారుడైన జెడిఎస్ ఎంపి, హసన్ లోక్‌సభ అభ్యర్థి 33 ఏళ్ల ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అశ్లీ వీడియోల కుంభకోణం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపి కాంగ్రెస్, ప్రతిపక్ష జెడిఎస్, బిజెపి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. లైంగిక వేధింపుల ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. కాగా, ఈ కేసులను సిబిఐకి అప్పగించాలని, బిజెపి, జెడిఎస్ కూటమి డిమాండు చేస్తోంది. ఇలా ఉండగా పిసిసి అధ్యక్షుడు కూడా అయిన డికె శివకుమార్ బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అశ్లీల వీడియోలున్న పెన్ డ్రైవ్ గురించి కుమారస్వామికి పూర్తిగా తెలుసునని న్యాయవాది(దేవరాజె గౌడ), మరికొందరు మాట్లాడుతున్నారని చెప్పారు.

కుమారస్వామి తన రాజీనామా కోరుతున్నారని, వొక్కలిగ నాయకత్వం కోసం పోటీ ఏర్పడినట్లు కనపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన కోరినట్లే రాజీనామా చేస్తానని శివకుమార్ ఎద్దేవా చేశారు. ఒకరి తర్వాత ఒకరిని రాజకీయంగా అంతం చేయడం కుమారస్వామికి వెన్నతో పెట్టిన విద్యని ఆయన ఆరోపించారు. కుమారస్వామిని బ్లాక్‌మెయిలింగ్ కింగ్‌గా అభివర్ణిస్తూ అధికారులు, రాజకీయ నాయకులు అందరినీ బెదిరించడం తప్ప ఆయనకు వేరే పని లేదని శివకుమార్ ఆరోపించారు. వీటన్నినిపై చర్చించే సమయం వస్తుందని, అసెంబ్లీలో వీటిపై చర్చ పెడతానని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News