Wednesday, January 22, 2025

అక్రమ రీతిలో కరెంట్ ఫైన్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : దీపావళి పండుగ సందర్భంగా దీపాలంకరణ విద్యుత్ వాడకానికి జరిమానాగా కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి రూ 68,526 చెల్లించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఈ జెడియు నేత స్వయంగా అంగీకరించారు. అక్రమ కనెక్షన్ నుంచి విద్యుత్ సరఫరా జరిగిందని తెలిసినందున తాను ఈ జరిమానా చెల్లించానని వివరించారు. అయితే ఇంత భారీ మొత్తం ఫైన్ అనుచితం, అత్యధికం అని ఆయన విమర్శించారు. తనకు వ్యతిరేకంగా రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును విమర్శించడం వల్లనే తనకు ఈ విధంగా అవమానం జరుగుతోందని ఆరోపించారు. తనకు విధించిన జరిమానా గురించి మాజీ సిఎం ఇప్పుడు బెంగళూరు విద్యుత్ సరఫరా సంస్థ (బెస్కామ్) విజిలెన్స్ విభాగం నిర్వాహణాధికారికి లేఖ రాశారు.అయితే ఇంత భారీగా జరిమానా విధించడం న్యాయమేనా? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News