- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ సిఎం కే. చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లో పాల్గొంటున్నట్లు ప్రకటించిన మరుక్షణమే దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఆయన ‘బిజెపి ముక్త్ భారత్’ నినాదాన్ని అనుసరించి, వివిధ పార్టీలకు చెందిన ముఖ్యమైన రాజకీయ నేతలు ఈ అంశంపై దృష్టి సారించడం ప్రారంభించిన ముచ్చట తెలిసిందే. సిఎం కెసిఆర్ ఇప్పటికే తనకు మద్దతుగా నిలుస్తున్న నేతలతో వరసగా భేటీ అవుతున్నారు. అందులో భాగంగానే జాతీయ రాజకీయాలపై చర్చించేందుకు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రగతి భవన్‌లో ఆదివారం సిఎం కెసిఆర్‌తో సమావేశమయ్యారు. కెసిఆర్ త్వరలో జాతీయ పార్టీని స్థాపించబోతున్న విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే జాతీయ రాజకీయాల్లో కెసిఆర్ క్రియాశీలక పాత్ర పోషించనున్నారు.
- Advertisement -