Thursday, November 14, 2024

కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు: కుమారస్వామి

- Advertisement -
- Advertisement -

కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని జేడిఎస్ నేత కుమారస్వామి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “5 గ్యారంటీల అమలులో కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ విఫలం. కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలు తెలంగాణకు వెళ్లి అబద్ధాలు మాట్లాడుతున్నారు. రైతులకు కరెంట్ ఎక్కడ ఇస్తున్నారో కాంగ్రెస్ నేతలు చెప్పాలి. కర్ణాటకలో ఏ సబ్స్టేషన్కు వెళ్లి చూసినా తెలిసిపోతుంది. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం.రైతులకు రూ.15 వేలు ఇస్తామని తెలంగాణలో కాంగ్రెస్ హామీ. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నారు. ఇప్పటికే రూ.73 వేల కోట్లకు పైగా రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో వేశారు.

రైతుబంధు పథకాన్ని బీజేపీ కాపీ కొట్టింది. గతంలో కర్నాటకలో ఎకరానికి రూ.4 వేలు ఇచ్చేవారు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.4 వేలు ఇవ్వడం లేదు. కాంగ్రెస్ దగాకోరు వైఖరిని, నయవంచనను అందరూ గుర్తించాలి. రైతులకు సీఎం కేసీఆర్ 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. కర్నాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కర్నాటకలో రైతులకు ఇస్తున్నది కేవలం 2 గంటల కరెంటే. యువ నిధి కింద గ్రాడ్యుయేట్స్ కు రూ.3 వేలు, డిప్లొమా హోల్డర్లకు రూ.1500 ఇస్తామన్నారు.

యువ నిధి పథకానికి ఇప్పటికీ అతీగతీ లేదు. ఇప్పుడేమో 2023-24లో పాసైన వారికే అని మాట మార్చారు.
కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలన్నీ గారడీలే. కాంగ్రెస్ దగాకోరు వైఖరిని, నయవంచనను ప్రజలందరూ గుర్తించాలి.
రాజస్థాన్ లో రైతు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారు. కర్నాటక రైతు రుణాలు ఎందుకు మాఫీ చేయరో చెప్పాలి.
కర్నాటక రైతులు రూ.33,700 కోట్లు నష్టపోయారు. కర్నాటక రైతులను కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ఆదుకోవడం లేదు” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News