Monday, December 23, 2024

తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న కుమారస్వామి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి జెడి(ఎస్) పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన చన్నపట్న నియోజవర్గం నుంచి ఈసారి బరిలోకి దిగారు. కానీ ఆయన కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ప్రధానంగా బిజెపి నాయకుడు సి.పి.యోగేశ్వరతో కుమారస్వామి పోటీపడుతున్నారు. యోగేశ్వర 1999 లో ఆ నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ సీటు నుంచి 2004, 2008లో అసెంబ్లీ ఎన్నికలు గెలిచారు. ‘ఆపరేషన్ లోటస్’ కారణంగా యోగేశ్వర బిజెపిలో చేరారు. తర్వాత ఆయన 2009లో జరిగిన ఉప ఎన్నికలో జెడి(ఎస్) అభ్యర్థి అశ్వత్ ఎం.సి చేతిలో ఓడిపోయారు. కానీ 2011లో జరిగిన ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిగా ఆ సీటును తిరిగి గెలుచుకున్నారు. తర్వాత ఆయన 2013లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పి) అభ్యర్థిగా పోటీచేసి కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామిని ఓడించి ఆ సీటును గెలుచుకున్నారు. ఆయనకి 80099 ఓట్లు రాగా, అనితకు 73635 ఓట్లు వచ్చాయి.

యోగేశ్వరను ఓడించి, అతడి రాజకీయ కెరీర్‌ను ఖతం చేయడానికి ఇప్పుడు కుమారస్వామి చన్నపట్న నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఇక కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి పొరుగునే ఉన్న రామ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. చన్నపట్న నియోజకవర్గంలో నగరానికి చెందిన 31 వార్డులు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 217606 ఓటర్లు ఉన్నారు. అందులో ముస్లిం ఓటర్లు 42.96 శాతం మంది ఉన్నారు. హిందు ఓటర్లు 55.66 శాతం మంది ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా పదేపదే కర్నాటకు చక్కర్లు కొడుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. జెడి(ఎస్)ను తుడిచిపెట్టమని కోరుతున్నారు. అయితే ముస్లింలు మాత్రం జెడి(ఎస్) వైపే గట్టిగా నిలబడ్డారని తెలుస్తోంది. కుమారస్వామికి వొక్కలిగ ఓట్లు కూడా బాగానే పడొచ్చని తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News