Wednesday, January 22, 2025

సిఎం వరమిచ్చారు

- Advertisement -
- Advertisement -

ధన్యవాదాలు తెలిపిన కుమారి ఆంటీ
అంతకుముందు ట్రాఫిక్ ఇబ్బంది పేరిట ఆమె
ఫుడ్ బిజినెస్‌ను మూసేయించిన పోలీసులు
సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన
సిఎం రేవంత్ పాత స్థలంలోనే బిజినెస్
నిర్వహణకు అనుమతించాలని పోలీసులకు ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్: పాత స్థలంలోనే ఫుడ్ బిజినెస్ చేసుకొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రెడ్డి అనుమతి ఇవ్వడంపై కుమా రీ ఆంటీ స్పందించారు. తనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరం ఇచ్చారన్నారు. తాను తిరిగి అదే స్థలంలో ఫుడ్ బిజినెస్ చేసుకొనేందుకు అ వకాశం కల్పించిన కుమారీ ఆంటీ సిఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు తాను బతికున్నంత కాలం రేవంత్ రెడ్డిని గుర్తుపెట్టుకుంటానని చెప్పారు. ఆయన రుణం మర్చిపోలేనన్నారు. ధన్యవాదాలు తెలిపారు. తన స్టాల్ వద్దకు సిఎం రేవంత్ రెడ్డి వస్తే ఆయనకు ఇష్టమైన ఫుడ్ చేసి పెడతానని కుమారీ ఆంటీ చెప్పారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుందనే కారణంగా కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ ను హైద్రాబాద్ పోలీసులు క్లోజ్ చేయించారు.

కుమారీ ఆం టీ ఫుడ్ వ్యాన్‌ను కూడ పోలీసులు సీజ్ చేశారు. ఈ విషయమై సోషల్ మీ డియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. దరిమిలా బుధవారం సిఎం రేవం త్ స్పందించారు. పాత స్థలంలోనే కుమారీ ఆంటీ తన ఫుడ్ బిజినెస్ ను కొనసాగించేందుకు అనుమతిని ఇచ్చారు. కుమారీ ఆంటీ పై నమోదైన కేసు విషయంలో పున:పరిశీలించాలని కూడ పోలీసులను సీఎం ఆదేశించిన విషయం విదితమే. సిఎం ఆదేశాలను గౌరవించాలని స్ట్రీట్ సైడ్ వ్యాపారాలు చేసుకొనే వారికి కుమారీ ఆంటీ సూచించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాతో లాభం ఉంది.. నష్టం కూడా ఉందన్నారు. తన ఫుడ్ బిజినెస్ పెరగడానికి మీడియా కారణమని ఆమె గుర్తు చేశారు. తన ఫుడ్ బిజినెస్ సెంటర్ వద్ద ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు తీసుకుంటానని కుమారీ ఆంటీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News