ఓటీటీ స్పేస్‌లో హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని చూడటానికి మీరు ఎదురు చూస్తున్నట్లయితే, స్వప్న సినిమా నిర్మాణంలో ‘అమెజాన్ ప్రైమ్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’ పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది. వెరీ ట్యాలెంటెడ్, అవార్డ్ విన్నింగ్ నటి నిత్యా మీనన్ ఈ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మోషన్ పోస్టర్‌తో పాటు టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు నేచురల్ స్టార్ నాని కుమారి శ్రీమతి ట్రైలర్ లాంచ్ చేసారు.
ట్రైలర్‌ని బట్టి చూస్తే, కుమారి శ్రీమతి తన జీవితంలో ఒక బలమైన ఆశయం కోసం ప్రయత్నించే ధైర్య సాహసాలు కలిగిన మహిళ ప్రయాణం. జీవితంలో విజయవంతం కావాలనే తన బలమైన ఆశయాన్ని నెరవేర్చుకునే ప్రక్రియలో ఆమె తన కుటుంబం, గ్రామంలోని పడికట్టు ఆలోచనలని బ్రేక్ చేస్తుంది.
నిత్యా మీనన్ ఈ తరానికి చెందిన ఆధునిక మహిళగా కనిపించింది. ఆమె నటన చాలా అద్భుతంగా ఉంది. గౌతమి, నరేష్, తాళ్లూరి రామేశ్వరి, మురళీ మోహన్, ప్రణీత పట్నాయక్, తిరువీర్ వంటి ప్రముఖ నటీనటులు ఈ సిరిస్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఈ వెబ్ సిరీస్‌కి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించగా, గోమటేష్ ఉపాధ్యాయే దర్శకత్వం వహించారు. 7-ఎపిసోడ్స్ ల సిరీస్ కు స్టాకాటో, కమ్రాన్ పాటలు అందించారు. మోహన కృష్ణ సినిమాటోగ్రాఫర్. లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్‌గా, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా పని చేశారు. చందు నిమ్మగడ్డ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించడానికి ‘కుమారి శ్రీమతి’ సెప్టెంబర్ 28న ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రసారం కానుంది.