Monday, January 20, 2025

శ్రీమతిగా నిత్యామీనన్ అద్భుతంగా నటించారు..

- Advertisement -
- Advertisement -

అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ నిత్యామీనన్ నటిస్తున్న ‘కుమారి శ్రీమతి’ని స్వప్న సినిమాస్ నిర్మించింది. ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఈ వెబ్ సిరీస్‌కి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించగా, గోమటేష్ ఉపాధ్యాయ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కుమారి శ్రీమతి’ గురువారం నుంచి ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకులు హను రాఘవపూడి, నందిని రెడ్డితో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ “కుమారి శ్రీమతి టైటిలే ఎక్స్‌ట్రార్డినరీగా వుంది. స్వప్నదత్ ఎక్కడా రాజీపడకుండా దీన్ని నిర్మించారు. ఇందులో కనిపించిన పాత్రలన్నీ మన చుట్టూ వున్నవే. డైలాగ్స్ చాలా బాగున్నాయి”అని తెలిపారు.

స్వప్న దత్ మాట్లాడుతూ “శ్రీమతి పాత్రని పోషించడం అంత సులువు కాదు. ఆ పాత్రలో చాలా ఎమోషన్స్ వుంటాయి. అలాంటిది నిత్యామీనన్ అద్భుతంగా నటించారు. అలాగే నిరుపమ్ తో పాటు అందరూ చక్కని నటన కనబరిచారు” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నందిని రెడ్డి, మనీష్, తాళ్ళూరి రామేశ్వరి, నిరుపమ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News