Friday, December 27, 2024

స్వక్షేత్రంలోకి కుజగ్రహం: ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

గురువారం నుండి కుజగ్రహం తన స్వక్షేత్రమైన వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ డిసెంబర్‌27 వరకు సంచరిస్తాడు. దీనివల్ల ముఖ్యంగా మీనం, కర్కాటక రాశుల వారికి విశేష లాభదాయకం. భూములకు సంబంధించిన కొనుగోళ్లు, అమ్మకాలు కలిసివస్తాయి. వివాదాలలో ఉన్న భూములపై వారి వాదనే నెగ్గుతుంది. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాల వారికి మరింత యోగవంతమైన కాలం. కర్కాటకం, కన్య, మకర రాశుల వారికి కూడా అనుకూల సమయమని చెప్పాలి. కుంభరాశి వారు మాత్రం అన్ని విషయాలలో అప్రమత్తులై ఉండాలి. కుంభరాశిలో ఉన్న శనిపై కుజుని దృష్టి వల్ల గ్రహయుద్ధం కలుగుతుంది. దీనివల్ల కష్టనష్టాలు ఎదురయ్యే సూచనలు. అలాగే, వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారి విషయంలోనూ కోపతాపాలు, శతృవృద్ధి వంటి ఫలితాలు ఉంటాయి. ఇక మిగతా రాశుల వారికి మిశ్రమంగా గడుస్తుంది. ప్రతికూలం ఫలితాలు కలిగిన ముఖ్యంగా కుంభరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయడం, స్వామికి పాలాభిషేకాలు నిర్వహించడం, సుబ్రహ్మణ్యాష్టకం పఠనం శ్రేయస్కరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News