Monday, January 20, 2025

కుంభ రాశికి కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయట!

- Advertisement -
- Advertisement -

ఆదాయం : 14 వ్యయం : 14
రాజ : 06 అవమానం : 01

ధనిష్ఠ 3,4 పాదములు, శతభిషం 1,2,3,4 పాదములు, పూర్వాభాద్ర 1,2,3 పాదముల యందు పుట్టినవారు “గు, గే, గో, సా, సీ, సు, సే, సో, దా” అను అక్షరములు తమ పేరునకు మొదటగలవారు కుంభరాశికి చెందినవారు.

కుంభరాశి వారికి ఈ సంవత్సరం తృతీయ చతుర్ధ రాశులలో గురు గ్రహ సంచారం జన్మరాశిలో శని గ్రహ సంచారం. గురు, శుక్ర మౌఢ్యయాలు, ద్వితీయ, తృతీయాలలో రాహుకేతు గ్రహ సంచారం ప్రధాన ఫలితాలు నిర్ణయించుతున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశివారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. కొత్త సంపాదనా మార్గాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతు సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. నూతన ఆహారపు అలవాట్లు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ పరంగా అభివృద్ధి బాగుంటుంది.

ఆర్థిక పరమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధ విషయాలు, స్థిరాస్తులు ఏర్పరుచుకోవడం జరుగుతాయి. ముఖ్యంగా వివాహ విషయంలో అన్ని విషయ వ్యవహారాలు పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ఒకటికి నాలుగు సార్లు పరిశీలించుకుని, ఇరువురి జాతకం, నక్షత్ర పొంతన సరిచూసుకుని వివాహ పరంగా నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. విద్యా సంబంధ విషయాలు అన్ని రంగాల విద్యార్ధి విద్యార్ధులకు, ఉద్యోగస్తులకి బాగున్నాయి. పి.హెచ్.డి చేసే వారికి, విదేశాలకు వెళ్ళే వారికి అనుకూల కాలం. షేర్ మార్కెట్ వారికి అనుకూలం. అయితే కొంత మందికి మాత్రమే వర్తిస్తుంది షేర్ మార్కెట్ ఫలితాలు.

వ్యక్తిగత జాతక ఫలితాలను బట్టి తారుమారు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలో అయినా కూడా వారివారి జాతక పరిశీలన బట్టి స్థితిగతులు మార్పులు, ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కావున వ్యక్తిగత జాతక పరిశీలన అనేది ముఖ్యం. మీ చిరకాల సొంత ఇంటి కల నెరవేరు కాలంగా చెప్పవచ్చును. బ్యాంకుల ద్వారా ఋణం పొంది నూతన గృహాలు, వాహనాలు తీసుకునే వారికి అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రామిసరీ నోట్ల విషయాలలో, బాండ్ పేపర్లు విషయాలలో జాగ్రత్త అవసరం. మీరు నడిపే విద్యా సంస్థలలో, ధార్మిక సంస్థలలో అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు వహించడం ద్వారా ఆర్థిక పురోగాభివృద్ధి పొందగలుగుతారు. సంతానం కోసం ఎదురు చూసే వారికి అనుకూలంగా ఉంటుంది.
సంతానం కోసం ఎదురు చూసే వారికి అనుకూలంగా ఉంటుంది.

కుటుంబంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సంతానంలేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. సంతానపాశుపత హోమం, పుత్రకామేష్ఠి హోమం చేయించండి. ఆరోగ్య పరంగా ఎటువంటి మానసిక ఒత్తిడికి, ఎటువంటి అపొహలకు తావు లేకుండా ఉండడం మంచిదని చెప్పదగిన సూచన. ర్యాభర్తల మధ్య ఇతరుల జోక్యం లేకుం డా ఉండుట మంచిది. వేరొకరి ప్రమేయం ఉంటే మీ మధ్యన మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉం టాయి.అటువంటి సంఘటనలు జరిగితే జీవితంలో కోలుకోలేని తప్పులు చేసిన వారుగా మిగిలిపోతారు. ఇతరులు మీ మధ్యకు రాకుండా జాగ్రత్త పడండి. జీవిత భాగస్వామి ద్వారా లాభాన్ని పొందుతారు. సలహాలు సహకారాలు సమపాళ్ళలో అందిపుచ్చుకుంటే ఆర్థిక పరంగా కలిసి వస్తుంది.

పదుగురిలో మన్ననలు పొందుతారు. గతంలో కుటుంబ కలహాల కారణంగా విడిపోవాలని నిర్ణయించకున్న భార్యాభర్తలకు న్యాయస్థానంలో తీర్పు వాయిదాపడే అవకాశా లు ఉన్నాయి. విడాకుల విషయంలో ఆలస్యం అ వుతుంది. కొంత మంది దంపతుల విషయంలో చట్టరీత్యా శాశ్వతంగా విడిపోవడం జరుగుతుంది. కుటుంబ సంబంధమైన కలహాలు, భా ర్య వేధింపులు, కోర్టులు, పోలీస్‌స్టేషన్లు మొదలై న వ్యవహారాలన్నీంటికీ తెర పడుతుంది, తాత్కాలిక ప్రశాంతత లభిస్తుంది. జీవితంలో ఓ ఆత్మీయుడితో విడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా యి. స్త్రీకి స్త్రీయే శతృవు అన్న విషయం మీ విషయంలో ఋజువు అవుతుంది.
ఆరోగ్య పరంగా మెళకువలు అవసరం. కొంత స్వయంకృతాపారాధాలు మీ ఆరోగ్యాన్ని క్షీణించే విధంగా చేస్తాయి. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలిక రోగాలు, నేత్ర సంబంధ వ్యాధుల విషయంలో జాగ్రత్తలు అవసరం.

అదే విధంగా వె న్నునొప్పి స్పాంటిలైట్ ఇబ్బందులు అమితంగా బాధించే అవకాశం ఉంది. స్త్రీ సంబందిత గైనిక్ ప్రాబ్లవ్‌‌సు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ము ఖ్యంగా ఈ సంవత్సరం శని, గురు సంబంధ కా ర్యక్రమాలు జపాలు, ెమాధి క్రతువులు చేయడం వలన గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఉ త్తమ ఫలితాలు పొంద డానికి ఆస్కారం ఉం టుంది. శారీరక వ్యాయామాలు, యోగా, మెడిటేషన్ వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి.
విదేశాలలో చదువుకోవడానికి అవకాశం వస్తుంది. విదేశాలలో ఉండి పార్ట్‌టైం ఉద్యోగా లు చేస్తున్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. మీరు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రీన్‌కా ర్డు, పి.ఆర్., హెచ్1బి వీసా లభిస్తాయి. వైద్యరంగంలో ఉన్నవారికి ముఖ్యంగా డాక్టర్లకు ప్రాక్టీస్ బాగా పెరుగుతుంది. హస్తవాసి మంచిదని ప్ర ఖ్యాతి లభిస్తుంది. ఇదేవిధంగా ప్రతిరంగంలో ఉ న్న వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి, ఇ దంతా శనిభగవానుని అనుగ్రహం వల్ల, గురుబ లం వల్ల ఇలాంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, క లిసి వస్తాయి.

మాతృ సంబంధిత వర్గం నుండి వివాహ సంబంధిత విషయాలు ప్రస్తావనకు వస్తాయి, బంధువులు పూనుకుని ఐకమత్యంగా నిర్ణయా లు తీసుకుంటారు. వివాహాది శుభ కార్యాలు చేస్తారు. మీరు అతి గోప్యంగా ఉండటం వల్ల మీ అంతరంగిక వర్గానికి విసుగు కలుగుతుంది. ద గ్గరి దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న పెళ్ళి సంబంధాల విషయంలో నిరాశ కలుగుతుంది. భృగుపాశుపత హోమం చేయించండి. అరటిచెట్టును వివాహం జరిపించండి. ఇందువల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు, శుక్రగ్రహ అనుగ్రహం వల్ల పెళ్ళి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ప్రేమ పెళ్ళిళ్ళు, కులాంతర వివాహాలు చర్చనీయాంశం అవుతాయి. ప్రేమ వివాహాలు కలిసిరావు. మనస్సులో మాట స్పష్టంగా చెప్ప డం వల్ల లౌక్యం లేకపోవడం వల్ల లేక ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల స్వతంత్ర నిర్ణయాల వల్ల చాలా సమస్యలను ఒంటరిగా ఎదుర్కోవలసి వస్తుంది, ధైర్యంగా ఎదుర్కొంటారు. మనస్సులోని ఆలోచన, వ్యూహం ఇతరులకు తెలియనివ్వరు.

న్యాయ పరమైన చిక్కుల నుండి బయటపడటానికి న్యాయ నిపుణులను సంప్రదిస్తారు, మంచి ఫలితాలను సాధిస్తారు. ఇంటర్వ్యూలలో విజయం మీదే. స్థిరాస్తుల విక్రయానికి ఇష్ట పడరు. కొన్ని సందర్భాలలో కీలక నిర్ణయాలు వె ంటవెంటనే చెప్పలేని పరిస్థితులు నెలకొంటా యి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చి నా వాటివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపార కూ డలి ప్రదేశాలు అద్దెకు ఇచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. జీవితంలో ఘనవిజయాలు సా ధిస్తారు. పోటీలేని చోట కూడా మీ మంచితనం వల్ల పోటీదారుల్ని మీరే కొని తెచ్చుకుంటారు.
మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంటుంది. వృ త్తివ్యాపార సంబంధమైన విషయాలను మళ్ళీ గా డిలో పెడతారు.

ఈ రాశిలో జన్మించిన వారు అ త్యంత ముఖ్యమైన వ్యక్తిని శాశ్వతంగా చట్టబద్ధంగా విడిపోవడం జరుగుతుంది (ఇది అందరివిషయంలో కాదు కొద్దిమంది విషయంలోనే). శత్రువర్గంపై మీరే విజయం సాధిస్తారు. సెల్‌ఫోన్ వాడటం వీలైనంత వరకు తగ్గించండి. పిల్లలకు టూ వీలర్ కొనిపెట్టవద్దు. ఈతలు పిక్నిక్ లు, డే నైట్ పార్టీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆర్థికస్థితి బాగుంటుంది. కన్సల్టెన్సీ ఫీజును పెంచుతారు. దారిద్య్రానికి దూరంగా కుటుంబాన్ని ఉంచాలనే ఉద్దేశ్యంతో దివారాత్రులు కష్టపడతారు. గతంలో కొనుగోలు చేసి న స్థిరాస్థి అమ్ముడు పోకుండా ఇబ్బంది పెడుతుంది. డబుల్ రిజిస్ట్రేషన్ వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. ఉన్నంతలో విలాసవంతమైన జీవి తం గడుపుతారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో మరొకరి సంపాదన మొదలవుతుంది. ఆభరణాల భద్రత విషయంలో జాగ్రత్త గా ఉండాలి, చోర భయం పొంచి వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News