Friday, November 22, 2024

ఆ వెబ్ సిరీస్‌లను ఉపసంహరించుకోవాలి: కూనంనేని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒటిటి ప్లాట్ ఫామ్‌లో ప్రసారమవుతున్న రానా నాయుడు, మీర్జాపూర్ వంటి వెబ్ సిరీస్ ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ముఖ్యంగా తెలుగు ప్రజలకు మంచి కుటుంబ కథా చిత్రాలు అందించిన దగ్గుబాటి రామానాయుడు కుటుంబ సభ్యుల నుండి రానా నాయుడు వంటి వెబ్ సిరీస్ రావడం దురదృష్టకరమని అన్నారు. అందులో అశ్లీల డైలాగులను దగ్గుబాటు వెంకటేశ్, రానా మాట్లాడడం కుటుంబ మర్యాదు భంగం కలిగేలా ఉన్నదని వ్యాఖ్యానించారు.

ఒటిటిలపై నియంత్రణ, సెన్సార్‌షిప్ లేకపోవడంతో అశ్లీల సన్నివేశాలు, డైలాగులు విశృంఖలంగా ప్రసారం చేస్తున్నారని, దీంతో యువత పెడదోవ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ ఉండడంతో ఒటిటిల ద్వారా వెబ్ సిరీస్ మారు మూల పల్లెల్లో సైతం సులువుగా వీక్షించేందుకు సౌలభ్యం కలిగిందని, దీంతో విష సంస్కృతి కింది వరకు వేగంగా పాకిపోతున్నదన్నారు. ఇది మంచిది కాదని, తక్షణమే వెబ్ సిరీస్ కూడా సెన్సార్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ముఖ్యంగా రానా నాయుడు వెబ్ సిరీస్ ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News