- Advertisement -
హైదరాబాద్: ప్రతిపక్షాలపై కేంద్రం ఐటి, ఇడిలను ప్రయోగిస్తుందని సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఇప్పటివరకు మూడు వేల ఇడి కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. దేశంలో ఆటవిక రాజ్యం కొనసాగుతుందని మండిపడ్డారు. తెలంగాణలో మంత్రి మల్లారెడ్డిపై మోడీ ప్రభుత్వం, కేంద్ర సంస్థలు కేసులు పెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపికి అనుకూలంగా ఉన్నవారిపై ఒక్కదాడైనా జరిగిందా? అని ప్రశ్నించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కుమార్ ఒక అజ్ఞాన్ని, ఆయన నటన ముందు ఎవరూ సరిపోరని కూనంనేని చురకలంటించారు. బిఎల్ సంతోష్ కు నోటీసిలిస్తే బండి సంజయ్ ఎందుకు ఏడుస్తున్నారని అడిగారు. వరవరరావులాంటి వారిని జైల్లో పెట్టినప్పుడు ఎందుకు స్పందించలేదన్నారు. సంతోష్ ఏమైనా దేవుడా?… నోటీసులిస్తే తప్పేంటని ప్రశ్నించారు.
- Advertisement -