Sunday, December 22, 2024

బైపాస్ రోడ్డు పనులు త్వరలో పునప్రారంభం

- Advertisement -
- Advertisement -

వేగవంతంగా పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడతాం

జంటపట్టణాల ట్రాఫిక్ సమస్యకు త్వరలో శాశ్వత పరిస్కారం

కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని

అధికారులతో కలిసి రోడ్డు ప్రతిపాదిత ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే

 

మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం: నిలిచిపోయిన పాల్వంచ-కొత్తగూడెం బైపాస్ రోడ్డు పనులను ప్రారంభించి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. పట్టణంలోని ప్యూన్ బస్తి, పాతకొత్తగూడెం శివారులోని ప్రతిపాదిత బైపాస్ రోడ్డు నిర్మాణ ప్రాంతాలను రోడ్లు భవనాలు నేషనల్ హైవే అథారిటీ అధికారులతో కలిసి బుధవారం కూనంనేని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జంట పట్టణాల ట్రాఫిక్ సమస్యను గుర్తించి అప్పటి ప్రభుత్వంతో కోట్లాడి బైపాస్ రోడ్డును ప్రతిపాదించి నిధులు మంజూరు చేయించడం జరిగిందని, పనులు పూర్తవుతున్న తరుణంలో ఆ తర్వాత పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయన్నారు. నిలిచిపోయిన పనులు మళ్లి ప్రారంభించి వేగవంతంగా పనులు పూర్తయ్యేలా చొరవ తీసుకుంటామన్నారు. బైపాస్ రోడ్డు పూర్తయితే ట్రాఫిక్ సమస్యకు పరిస్కారం లభిస్తుందని కూనంనేని తెలిపారు. రోడ్లు భవనాల శాఖ అధికారులు నేషనల్ హైవే అథారిటీ అధికారులు రోడ్డు నిర్మాణ విషయంలో ప్రత్యేక ద్రుష్టి సారించి పనులు ప్రారంభించి పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, నాయకులు వాసిరెడ్డి మురళి, వట్టికొండ మల్లికార్జున్ రావు, భూక్యా శ్రీను, కూనంనేని భరత్, జలీల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News