Thursday, January 23, 2025

వెన్నుపోటు ఎలా పొడవాలి.. అధికారంలోకి ఎలా రావాలన్నదే కెసిఆర్ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కనీస రాజకీయ విలువలు పాటించలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. గురువారం సిపిఐ నేతలు కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. “పొత్తు లేదని చెప్పాలి కానీ ఒక్క సీటు ఇస్తానని అంటారా? అని అగ్రహం వ్యక్తం చేశారు. 2004లో కాంగ్రెస్, 2009లో టిడిపితో కెసిఆర్ పొత్తు పెట్టుకున్నారు. ఎవరు బలంగా ఉంటే వాళ్లతో కెసిఆర్ పొత్తు పెట్టుకుంటారు. వెన్నుపోటు ఎలా పొడవాలి.. అధికారంలోకి ఎలా రావాలన్నదే కెసిఆర్ లక్ష్యం. బిఆర్ఎస్ చేసిన తప్పుతో కుమిలిపోం.. మా సత్తా ఏంటో చూపిస్తాం” అని కూనంనేని బిఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు.

“30 స్థానాల్లో సిపిఐకి 10 వేలకు పైగా ఓటు బ్యాంకు ఉంది. అమరులకు కెసిఆర్ చేసిన వాగ్దానాలు మర్చిపోయారు. ఎన్నికలప్పుడు కెసిఆర్ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతారు. సిపిఐ ఎప్పుడూ మాట తప్పని, మడమ తప్పిన పార్టీ. ఎంపి కేశవరావు రాజ్యసభకు వెళ్లింది లెఫ్ట్ పార్టీ ఓట్లతోనే. 2004,2009లో కూడా పొత్తులు అంటూనే కెసిఆర్ ధర్మ తప్పారు” అని చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News