Thursday, January 23, 2025

బిజెపి ఉన్మాద రాజకీయం : కూనంనేని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మేడ్చల్ నియోజకవర్గం, కాప్రా మండలం, జవహర్ నగర్ లో జరిగిన సిపిఐ బహిరంగ సభలో కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన ప్రసంగం కొనసాగిస్తూ మోడీ అనుసరిస్తున్న విద్వేషపూరిత రాజకీయం, ఫాసిస్టు భావజాలం పౌర సమాజంలో చొప్పిస్తు దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారని విమర్శించారు. ఉన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా మన పౌర సమాజంలో ఒక గొప్ప భావజాల సంఘర్షణకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మోడీ పాలన ప్రజా అనుకూలం కాకపొగా ప్రజావ్యతిరే కమైందని అన్నారు. దేశానికి అచ్చా దిన్ రాలేదని పేర్కొన్నారు. విదేశాలలో ములుగుతున్న నల్లధనాన్ని తీలేదని, ప్రజలకు పంచలేదని విమర్శిం రు. పెద్ద నోట్ల రద్దుచేసి దేశంలో నల్లధనం వెలికి తీస్తానన్నది జరగలేదని వారన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయని, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగి పోయి ప్రజలపై భారం మోపిందని అన్నారు.

నిరుద్యోగం, రైతుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందారని అన్నారు. భారత జాతీయ వాదం దేశ పౌరులందరిని సమానంగా చూస్తుందని, హిందూ జాతీయ వాదం ఈ దేశం హిందువులది మాత్రమేనని ఇతరులు పరాయి వారిగా చిత్రీకరించి బిజెపి విద్వేష రాజకీయాలకు ఆజ్యం పోస్తుందని విమర్శించారు. బిజెపి మనువాదంకు వ్యతరేకంగా ప్రజలను చైతన్యం చేసి పోరాటాలను ఉదృతం చేయాలని, అందుకే సిపిఐ భారతదేశ వ్యాప్తంగా ప్రజలను కలుస్తూ పోరాటాలకు సమాయత్తమవుతుందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్. బాలమల్లేష్ ప్రసంగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఇంటింటికి సిపిఐ పేరుతో లక్షణాది ప్రజలను కలుసుకోవడం జరిగిందని అన్నారు.

మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాకాంతం అవుతున్నాయని, ప్రభుత్వ భూములను రక్షించి పేదలకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ బహిరంగ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి డి జి సాయిల్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ దశరథ, మేడ్చల్ నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి టి. శంకర్, జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు జే. లక్ష్మి, ఆర్ కృష్ణమూర్తి, రచ్చ కిషన్, సిపిఐ మండల కార్యదర్శి డి. యాదగిరి, తోట్టి ఈశ్వర్, ఎన్. కృష్ణ యాదవ్, టి రాములు గౌడ్, టి యాదయ్య గౌడ్, కే సహదేవ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్రావు, మహిళా సమైక్య నాయకురాలు రాజేశ్వరి, స్వరూప, ప్రమీల, మాధవి, మహాలక్ష్మి, రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహులు ఆటపాటలతో సభ ఉత్సాహంగా జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News