Friday, January 24, 2025

కెసిఆర్.. కనీసం మిత్రధర్మం పాటించరా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని, ఇది మేం ఊహించని పరిణామమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం సిపిఎం, సిపిఐ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. మునుగోడులో ఆయనే మద్దతు అడిగారు. వచ్చే ఎన్నికల్లో కూడా కలిసి పని చేస్తామని చెప్పారు. సిఎం కెసిఆర్ ఏకపక్షంగా అభ్యర్థుల జాబితా ఇచ్చారు. మేం అడిగిన సీట్లలో కూడా అభ్యర్థులను ప్రకటించారు.. మేం ఇది ఊహించని పరిణామం అని పేర్కొన్నారు.

అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. “బిజెపితో సిఎం కెసిఆర్ కు సఖ్యత వచ్చింది. మునుగోడులో బిజెపి ప్రమాదమని చెప్పిన కెసిఆర్‌కు బిజెపితో మిత్రుత్వం ఎక్కడ కుదిరింది?. కనీసం మిత్ర ధర్మం పాటించరా?.. కెసిఆర్ సమాధానం చెప్పాలి. రాజకీయం అంటేనే మోసం అనే నిర్వచనం ఇస్తున్నారు. వామపక్షాలు లేకపోతే మునుగోడులో బిఆర్ఎస్ ఏమయ్యేది. రాష్ట్రంలో సిపిఐ, సిపిఎం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. మేము కూడా గెలవడానికి తుదివరకు పోరాడుతాం. కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తాం” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News