Monday, January 20, 2025

మా ‘పాప’కు ప్రాణభిక్ష పెట్టండి..

- Advertisement -
- Advertisement -

ఖమ్మం:11 నెలల పాప కుందనికాశ్రీ లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతుందని ఆమె వైద్యానికి అయ్యే ఖర్చుకు దాతలు ముందుకు వచ్చి సహకరించాలని బిజేపి ఖమ్మం జిల్లా పార్లమెంటరి పార్టీ ఇంఛార్జి నంబూరి రామలింగేశ్వరరావు కోరారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో భాగంగా బుధవారం పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో వీధి సమావేశం నిర్వహించారు. పక్కన ఉన్న ఇంటి నుంచి ఓ చిన్నపాప ఏడుపు ఆగకుండా వినిపిస్తుంది. అక్కడ ఉన్న వారిని ఆ పాపను చూసేవాళ్లు లేరా అంతలా ఏడుస్తున్నా పట్టించుకోరే అని అడిగితే ఆ పాప ఏడుపు ఆపితే పాప ఊపిరి ఆగినట్టే అని జవాబు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే కుందనికా శ్రీ అనే 11 నెలల పాపకు లివర్ సంబంధిత వ్యాధితో నరకయాతన పడుతుంది. పాప అనారోగ్య పరిస్థితి పాప తల్లి తండ్రి పూర్ణచంద్రరావు లక్ష్మీతిరుపతమ్మ వివరించారు.

హైదరాబాద్‌లోని ఫేస్ ఆసుపత్రిలో వైద్యం చేసే అవకాశం ఉందని, లివర్ మార్పిడి ఆపరేషన్ నిమిత్తం రూ. 23 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. మద్రాస్ రేల హాస్పటల్‌కు కూడా వెళ్ళారు కాని అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ వర్తించని చెప్పారని వివరించారు. కడు పేదరికంలో ఉన్న ఆ తల్లి దండ్రులను ప్రభుత్వం ఆసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు భరించి ఆ పాపకు ప్రాణబిక్ష పెట్టాలని కోరుతున్నారు. ఎవరైనా దాతలు ఆర్ధిక సహాయం చేయాలనుకుంటే 9701123073, 8639210558 లకు గూగుల్‌పే కానీ ఫోన్ పే చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ అధ్యక్షులు ఆచంట నాగస్వామి, పాలకొల్లు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు నాయుడు రాఘవరావు, సుదర్శన్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News