- Advertisement -
అమరావతి: ఏనుగులు దాడి చేయడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో జరిగింది. మల్లనూరు గ్రామానికి చెందిన ఉషా అనే మహిళ రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా ఏనుగు దాడి చేయడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. సప్పానికుంటలో శివలింగం అనే రైతు పొలం నుంచి ఇంటికి వెళ్తుండగా అతడిపై కూడా ఏనుగు దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఏనుగుల నుంచి తమను కాపాడాలని కుప్పం మండలానికి చెందిన గ్రామ ప్రజలు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఏనుగులు దాడి చేస్తాయో అర్థం కావడం లేదని వివిధ గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
- Advertisement -