Saturday, December 21, 2024

వాళ్లకు మంచి పేరు వస్తుండడంతో పవన్ కు కడుపుమంట: కన్నబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: అవగాహనలేమితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారని వైసిపి నేత కురసాల కన్నబాబు తెలిపారు. మంగళవారం కన్నబాబు మీడియాతో మాట్లాడారు.  సిఎం జగన్ మోహన్ రెడ్డిపై ద్వేషంతోనే పవన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి, వాలంటీర్లకు మంచి పేరు రావడంతో పవన్‌కు కడుపుమంటగా మారిందన్నారు. పవన్‌కు సభ్యతా ఉందా?, స్పృహలేకుండా మాట్లాడడం ఆయనకు అలవాటుగా మారిందని కన్నబాబు ధ్వజమెత్తారు. పవన్ వ్యాఖ్యలపై ఎపి వ్యాప్తంగా వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలను వాలంటీర్లు దగ్ధం చేస్తున్నారని, తమపై రాజకీయ కక్షతో వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడుతున్నా విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌పై పోలీస్ స్టేషన్లలో వాలంటీర్లు ఫిర్యాదులు చేశారు.

Also Read: ఎన్నికల గెలుపు కోసమే వాలంటీర్ వ్యవస్థ: సోము వీర్రాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News