Wednesday, January 22, 2025

కుర్చీ మడతపెట్టి ఫుల్ సాంగ్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైంది. ఈ మూవీలో సాంగ్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కుర్చి మడతపెట్టి అనే లిరకల్ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఓ ఊపు ఊపింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

ఇందులో మహేష్, శ్రీలీల మాస్ స్టెప్స్ తో ఇరగదీశారు. థియేటర్ లో ఈ సాంగ్ చూసేందుకే వెళ్లిన రిపీట్ ఆడియన్స్ కూడా ఉన్నారు. ఇక, సినిమా విషయానికి మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చినా.. పండుగ సీజన్ కలిసి రావడంతో గుంటూరు కారం రికార్డు కలెక్షన్స్ రాబట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News