Monday, December 23, 2024

ప్రియురాలిని చంపి… కూతురుకు ఫోన్ చేశాడు…

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ప్రియురాలిని ప్రియుడు చంపి ఆమె కూతురు ఫోన్ చేసి చంపానని చెప్పిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నెల్లూరుకు చెందిన సుధారాణి అనే మహిళ తన భర్తతో విడాకులు తీసుకొని తన కూతురు కలిసి జీవిస్తోంది. కర్నూలులోని గరురాఘవేంద్ర నగర్ కాలనీలో తన కూతురుతో కలిసి ఉంటుంది. ట్రాక్టర్ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి పరిచయం కావడంతో ఇద్దరు సన్నిహితంగా ఉంటున్నారు. ఈ సన్నిహితం ఇద్దరు మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.

సుధారాణి తనకు తెలియకుండా రోజుల తరబడి బయటకు వెళ్తుందని అనుమానాలు పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. గురువారం ఇద్దరు మధ్య గొడవ జరగడంతో చున్నీతో ఆమెకు ఉరేశాడు. అనంతరం ఆమె కూతురుకు ఫోన్ చేసి “మీ అమ్మను చంపానని” చెప్పాడు. దీంతో వెంటనే ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Also Read: ఒకడు చిల్ అయ్యాడు… పోలీస్ బాస్ ఔట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News