Wednesday, January 22, 2025

కర్నూలులో భార్యను కత్తితో పొడిచిన భర్త

- Advertisement -
- Advertisement -

అమరావతి: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త కత్తితో పొడిచిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మారుతీనగర్‌లో చక్రవర్తి-సునీత అనే దంపతులు నివసిస్తున్నారు. గత కొన్ని రోజులుగా దంపతలు మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం దంపతుల మధ్య గొడవ జరగడంతో చక్రవర్తి కత్తి తీసుకొని భార్య సునీతపై దాడి చేశాడు. ఈ దాడిలో సునీత తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: మహిళా డ్రైవర్‌కు ఉద్వాసన..కారు కొనిచ్చిన కమల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News