అమరావతి: పెద్దలను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మంచిగా మాట ఇచ్చిన ప్రేమికుడు వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక కన్న బిడ్డను వదిలి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగింది. ఆదోనిలోని విక్టోరియా పేటలో నాగరాజు, శ్వేత అనే దంపతులు నివసిస్తున్నారు. శ్వేత తన కుటుంబ సభ్యులు ఎదురించి మూడు సంవత్సరాల క్రితం నాగరాజును ప్రేమ పెళ్లి చేసుకుంది.
ఈ దంపతులకు రెండేళ్ల కుమార్తె మౌఖిక కూడా ఉంది. నాగరాజు నూనె దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తుండగా శ్వేత లేడీస్ కార్నర్ లో పని చేస్తోంది. నాగరాజు మద్యానికి బానిసగా మారి భార్యను పలుమార్లు వేధింపులకు గురి చేశాడు. మద్యం ఫుల్‌గా తాగొచ్చి భార్యతో నాగరాజు గొడవ పడ్డాడు. ఆమె అర్థరాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.