Sunday, December 22, 2024

దంపతుల ప్రాణం తీసిన క్షణికావేశం….

- Advertisement -
- Advertisement -

అమరావతి: దంపతుల మధ్య గొడవ ఇద్దరు ప్రాణాలు తీసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గుడమిరాల గ్రామానికి చెందిన అడ్డాకుల రంగనాయకులు(28) రెండు సంవత్సరాల క్రితం చిన్నహుల్తికి చెందిన లత(25)ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. పొలం పనులకు వెళ్లే విషయం ఇద్దరు మధ్య గొడవ జరగడంతో మనస్థాపం చెంది భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

Also Read: భరతమాతకు మరో మణిహారం నూతన పార్లమెంటు భవనం : పవన్‌కల్యాణ్

భార్య చనిపోవడంతో అప్పటి నుంచి భర్త కనిపించకుండా పోయాడు. కర్నూలులోని కోట్ల రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై రంగనాయకుల మృతదేహం గుర్తించి రైల్వే పోలీసులు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తల, మొండెం వేరు కావడంతో ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అమ్మ నాన్న చనిపోవడంతో వీరి కుమారుడు అనాధగా మారాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News