Monday, December 23, 2024

ఆటోను ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నందవరం మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మాపురం వద్ద ఆటోను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో రజియా అనే బాలిక తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు బేబీ(32), వీర నాగమ్మ(60), గౌరమ్మ(62)లుగా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం ధాటికి కారు, ఆటో ఎగిరి రహదారి పక్కన పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News