Sunday, December 22, 2024

కర్నూలులో టిడిపి నేత దారుణ హత్య…. ఖండించిన లోకేశ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పత్తికొండలో టిడిపి నేతను దారుణంగా హత్య చేశారు. హోసూరు గ్రామంలో వాకిటి శ్రీను టిడిపిలో చురుకు కార్యకర్తగా పని చేసేవాడు. బుధవారం ఉదయం బహిర్భూమికి వెళ్లగా అతడి కళ్లలో కారంచల్లి దుండగలు చంపేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికలలో టిడిపి తరుపున చురుకగా పని చేయడంతో శ్రీనివాస్ హత్య చేశారని ఎపి మంత్రి లోకేశ్ ఆరోపణలు చేశారు. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని, శ్రీనివాసులు కుటుంబానికి అండగా ఉంటామని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News