Thursday, January 23, 2025

చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. ముగ్గురు నీటిలో మునిగిపోయిన విషయం తెలిసిన వెంటనే స్థానికులు సహాయంతో పోలీసులు నీళ్లలో గాలింపు చర్యలు చేపట్టారు. మూడు మృతదేహాలను బయటకు తీశారు. మృతులు మరియమ్మ, లోకేష్, సలోమీగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: రోహిణిలో వానాకాలం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News