Thursday, January 23, 2025

ఫ్యాక్షన్ గొడవలు… నిద్రిస్తున్న వ్యక్తిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్లలో ఫ్యాక్షన్ గొడవలు భగ్గుమన్నాయి. ప్రత్యర్థులు నిద్రిస్తున్న కోటేష్ అనే వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. కోటేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూలులో ఫ్యాక్షన్ గొడవలు పెచ్చుమీరుతున్నాయి. శత్రువులు ఎవరు ఎవరిపై దాడి చేస్తారో? అర్థం కావడం లేదు. ఫ్యాక్షన్ గొడవలకు రాజకీయ రంగు పులుముకోవడంతో పాలక పక్షంలో ఉన్న నాయకుల అండ ఉండడంతో చెలరేగిపోతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: జపాన్ ప్రధానిపై బాంబు దాడి..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News