Monday, December 23, 2024

కర్నూలులో భార్య, అత్తను చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

అమరావతి: భార్య, అత్తను భర్త కొట్టి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాపురం గ్రామంలో మహాదేవి అనే మహిళ (25) తన తల్లి హనుమంతమ్మ కలిసి జీవిస్తోంది. మహాదేవి గత సంవత్సరం కర్నాటకకు చెందిన రమేష్‌ను రెండో పెళ్లి చేసుకుంది. పెళ్లి జరిగిన తరువాత కర్నాటకలోని టెక్కలికోటలో ఉండాలని భార్యకు భర్త పలుమార్లు చెప్పాడు. దీంతో ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. శనివారం అర్థరాత్రి రమేష్ బాపురం గ్రామం వచ్చి భార్యను తనతో పంపించాలని అత్తతో గొడవకు దిగాడు. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కర్ర తీసుకొని భార్య, అత్త తలపై బాది అక్కడి నుంచి తప్పించుకున్నాడు. గ్రామస్థులు వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఇద్దరు చనిపోయారని వెల్లడించారు. హనుమంతమ్మ సోదరుడు అయ్యప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: పరస్త్రీ మోజులో ఆర్మీ అధికారి..కోర్టు మార్షల్ శిక్ష ఖరారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News