Monday, December 23, 2024

మంత్రాలయంలో రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మంత్రాలయంలో ఆంజనేయులు, జయమ్మ అనే దంపతులు టిస్టాల్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతలు పెద్ద కూతరు నందిని(20) కర్నూలులో బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. మంత్రాలయం మండలంలోని రచ్చుమర్రికి చెందిన చిన్నగోవిందు కుమారుడు చిన్న వెంకటేశం(22) ఇంటర్ వరకు చదివ వ్యవసాయం చేస్తున్నాడు. నందిని, వెంకటేశం ఒకే స్కూల్ చదవడంతో ఇద్దరు ప్రేమించుకున్నారు.

ఉగాది పండుగ సందర్భంగా నందిని తన ఇంటికి వచ్చింది. ఆదివారం రాత్రి నందిని కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతికారు. మంత్రాలయం-మటుమర్రి రైల్వేస్టేషన్ల మధ్య ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుందని తెలియగానే అక్కడి వెళ్లి చూడగా తన కూతరును దంపతులు గుర్తు పట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి రెండు మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరి ప్రేమ వివాహానికి పెద్దలు అడ్డు చెప్పడంతోనే ఆత్మహత్య చేసుకున్నారా? లేక మరో కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News