Monday, December 23, 2024

చేనులో తోడికోడళ్ల గొంతుకోసి…..

- Advertisement -
- Advertisement -

 

అమరావతి న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఓరకల్లు మండలం నన్నూరు గ్రామంలో ఇద్దరు తోడికోడళ్లు గడ్డి కోసం పొలానికి వెళ్లినప్పుడు వారిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గుర్తు తెలియని దుండగులు పొలంలో వారి గొంతు కోసి హత్య చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు రాజేశ్వరి. రేణుకగా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నారు. ఇద్దరు మహిళల భర్తలు, మామను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News