Thursday, December 19, 2024

కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టింబర్‌లో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో నలుగురు సజీవదహనమయ్యారు. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో పక్కన ఉన్న ఇండ్లకు మంటలు విస్తరించాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. మృతుడు వరంగల్ జిల్లాకు చెందిన నరేష్, సుమ, బాబుతో పాటు మరో కార్మికుడు మృతి చెందినట్టు గుర్తించారు. షార్ట్ సర్కూట్‌తోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News