Thursday, December 19, 2024

కుషాయిగూడలో ప్రియుడి కోసం కూతురును చంపిన తల్లి

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: ప్రేమ పెళ్లి చేసుకుంది… వివాహేతర సంబంధానికి కూతురు అడ్డుగా ఉండడంతో పసిపాపను తల్లి చంపేసి నిద్రలో చనిపోయిందని నాటకమాడింది. పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించిడంతో తానే హత్య చేశానని ఒప్పుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. 2018లో రమేష్ కుమార్, కల్యాణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రమేష్ కుమార్ ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2019లో కూతురు పుట్టడంతో బాలికకు తన్విత అని పేరు పెట్టుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి దంపతులు మధ్య మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. కాప్రాలో కల్యాణి తన కూతురు కలిసి అమ్మగారింట్లో ఉంటుంది. జనగాం జిల్లా బచ్చనపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన నవీన్(19)తో కల్యాణికి పరిచయం ఏర్పడింది. దూరపు బంధువు కావడంతో అప్పుడప్పుడు కల్యాణి ఇంటికి నవీన్ వచ్చేవాడు.

Also Read: ఎనిమిది మందిని పెళ్లాడిన యువతి..ఆతర్వాత

దీంతో ఇద్దరు మధ్యల వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తకు విడాకులు ఇచ్చిన తరువాత తన్వితను చంపేయాలని కల్యాణి-నవీన్ ప్లాన్ వేశారు. ప్లాన్ లో భాగంగా జులై 1న తన్విత స్కూల్‌కు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తరువాత పడుకోబెడుతున్నట్టుగా నటించింది. బాలిక ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. మళ్లీ ఏమీ తెలియనట్టు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండిపోయింది. కల్యాణ్ తల్లి వచ్చి తన్విత పడుకోవడంతో లేపటానికి ప్రయత్నించింది. బాలికలో చలనం లేకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చనిపోయారని చెప్పడంతో వెంటనే తన భర్త రమేష్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. జులై 2న తన భార్యపై అనుమానం ఉందని స్థానిక పోలీస్ స్టేషన్‌లో భర్త రమేష్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి భార్యను తనదైన శైలిలో ప్రశ్నించడంతో తాను హత్య చేశానని ఒప్పుకుంది. ప్రియుడు, ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News